భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని శివరామకృష్ణ, భద్రాచలంకు చెందిన శ్రీ హర్షిత ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో 2016 మార్చిలో వివాహం చేసుకున్నారు. కొంతకాలం అత్త మామ ఇంట్లో ఉన్న శ్రీ హర్షిత, శివరామకృష్ణ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లారు. కొన్నిరోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో వివాదాలు మొదలయ్యాయి. తన అత్త మామ కారణంగానే వివాదాలు తలెత్తాయని శ్రీ హర్షిత ఆరోపిస్తోంది. భర్త కట్నం కోసం వేధించడం వల్ల హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
భర్త ఇంటి ముందు రెండు రోజులుగా భార్య ధర్నా - భర్త కోసం భార్య నిరసన వార్తలు సారపాక
ప్రేమిస్తున్నానని నమ్మించి పెద్దలను ఒప్పించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న యువకుడు ఆరేళ్లు గడవకముందే భార్యను అష్టకష్టాలు పెట్టాడు. కట్నం కోసం వేధించాడు. ఏడు జన్మలు తోడుంటానని ప్రమాణం చేసిన భర్త ఏకంగా పరారయ్యాడు. దీంతో చేసేదేం లేక అత్తింటి ముందు భర్త కావాలని రెండు రోజులుగా ధర్నాకు దిగింది ఆ బాధితురాలు. భర్త వచ్చేవరకు నిరసన కొనసాగిస్తాని కుమారుడితో సహా అత్తింటి గేటు ముందు భీష్మించుకుకూర్చుంది.
ఆ తర్వాత అతని తల్లిదండ్రుల ఇంటికి సారపాక వచ్చిన భర్త శివరామకృష్ణ మాట్లాడటం మానేశాడని హర్షిత తెలిపింది. ఫోన్ నంబర్లను కూడా మార్చి పూర్తిగా వదిలించుకునే ప్రయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. పది నెలలుగా భర్త కోసం అనేక ప్రయత్నాలు చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అత్తమామలు ఇంట్లోకి కూడా రానివ్వట్లేదని వివరించింది. ఇక చేసేదేమి లేక తన అత్తింటి ముందు రెండురోజులుగా ధర్నాకు దిగింది. తన భర్త వచ్చేంత వరకు నిరసన వీడేదిలేదని కుమారుడితో సహా భీష్మించుకుకూర్చుంది.
ఇదీ చదవండి:నేనుండగానే ఇంకో పెళ్లా..! భర్త ఇంటిముందు భార్య ధర్నా