వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేసిన ఘటన నెక్కొండ మండలం గేటుపల్లిలో చోటుచేసుకుంది. నెక్కొండ పట్టణంలో గత కొంత కాలంగా దుర్యత్సింగ్ భార్య జ్యోతి టైలరింగ్ షాపు నిర్వహిస్తుంది. ఈక్రమంలో మండలంలోని అప్పల్ రావుపేటకు చెందిన రాజుతో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈవిషయం భర్త దుర్యత్ సింగ్ కంటపడింది. దీంతో ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన జ్యోతి ప్రియుడు రాజుతో కలసి దుర్యత్ సింగ్ను పథకం ప్రకారం హత్య చేసింది.
ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య - crime news
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త ప్రాణాలను బలి తీసుకుంది ఓ భార్య. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం గేటుపల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య
రాత్రికిరాత్రే ఊరు బయట పంటపొలాల్లో గొయ్యి తీసి పాతిపెట్టింది. విషయం భర్త తరఫున బంధువులకు తెలియడం వల్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా.. జ్యోతి బండారం బయట పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. మృతుడు దుర్యత్ సింగ్(40) వరంగల్లో ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు.
ఇవీ చూడండి: 'నా భార్యను తీసుకెళ్లిపోయారు... న్యాయం చేయండి'