హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట ఠాణా పరిధిలోని ఇంద్రానగర్‌లో ఈ నెల 18న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. నసీర్ అనే వ్యక్తి తన భార్య హలీమా, పిల్లలతో కలిసి ఇంద్రానగర్‌లో ఉంటూ పెట్రోల్ పంపులో పనిచేసేవాడు. ఈ నెల 18న నసీర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీడిన హత్య మిస్టరీ... ప్రియునితో కలిసి భార్యే చంపించింది! - chandrayangutta news
హైదరాబాద్ పాతబస్తీ ఇంద్రానగర్‌లో ఈ నెల 18న జరిగిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేధించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మృతుని భార్య.. ఆ వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
wife murdered husband in old city
దర్యాప్తులో మృతుడి భార్య హలీమనే... వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు వెల్లడైంది. హలీమ, బిలాలా హుస్సేన్ కలిసి నసీర్ ముఖంపై దిండు పెట్టి ఉపిరాడనివ్వకుండా చేశారు. రుమాలుతో గొంతుకు ఉరేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు పాల్పడ్డ హాలీమా, బిలాల్ హుస్సేన్‌ను చంద్రాయన్‌గుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.