జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లిలో గ్రామంలో కుటుంబ కలహాలతో భార్యే భర్తను హత్య చేసిన ఘటన జరిగింది. గ్రామంలో గత 3 సంవత్సరాల నుంచి అత్తగారింట్లోనే అల్లుడు ఆలకుంట లక్ష్మయ్య (38) ఉంటున్నాడు. అయితే శనివారం రాత్రి ఇంట్లో గొడవపడి అత్తని తలపై కొట్టడం వల్ల కోపగించుకున్న భార్య భర్తను కత్తితో గొంతు కోసి చంపేసింది.
దారుణ ఘటన.. గొంతుకోసి భర్తను చంపిన భార్య... - జగిత్యాల జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య
కుటుంబ కలహాలతో నేపథ్యంలో భర్త గొంతు కోసి భార్య హత్య చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా తిమ్మాయిపల్లిలో జరిగింది.
భర్తను గొంతుకోసి చంపిన భార్య...
తర్వాత ఇంటి ముందు ఉన్న గ్రామపంచాయతీ ఆవరణలో అతన్ని కట్టేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:మద్యం మత్తులో డ్రైవర్.. దుకాణంలోకి దూసుకెళ్లిన కారు