మద్యం తాగి వచ్చి రోజు వేధిస్తున్న భర్త ప్రవర్తనతో విసుగెత్తిన భార్య... భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఏపీలో కర్నూలు జిల్లా బేతంచేర్ల మండలం గోర్లగుట్ట గ్రామంలో జరిగింది.
దారుణం: శాడిస్ట్ భర్త... చంపిన భార్య - gorlagutta wife kills husband news
మద్యం రక్కసి దాహానికి పచ్చని కాపురం బలైంది. మద్యానికి బానిసైన భర్త... రోజూ తాగి వచ్చి భార్యను వేధించే వాడు... భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య... భర్తను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ దారుణ ఘటన ఏపీలో కర్నూలు జిల్లా గోర్లగుట్టలో జరిగింది.
గ్రామానికి చెందిన ధనలక్ష్మి, వడ్డే చిన్న రామాంజినేయులు భార్యాభర్తలు. రామాంజనేయులు గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండగా.. ధనలక్ష్మి కూలి పని చేసేది. మద్యానికి అలవాటు పడ్డ రామాంజనేయులు ప్రతి రోజు.. తాగి వచ్చి భార్యను వేధించేవాడు. భర్త ప్రవర్తనతో విసుగెత్తిన ధనలక్ష్మి... రామంజనేయులు నిద్రిస్తున్న సమయంలో తల, గొంతుపైన గొడ్డలితో నరికి హత్య చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తండ్రి హత్యకు గురవ్వటం... తల్లి కటకటాలపాలవటం వల్ల ... వీరి ముగ్గురు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.