తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లైన 20 రోజులకే... భర్తను చంపేసింది - wife killed husband news

పెళ్లై పట్టుమని నెల కూడా కాలేదు. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త రోజూ మద్యం తాగుతూ భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆమె వేధింపులు తట్టుకోలేకపోయింది. ఆవేశంలో భర్తను రోకలిబండతో కొట్టింది.

wife-killed-husband-for-his-harassment-in-tappachabutra-police-station-circle
పెళ్లైన 20 రోజులకే... భర్తను చంపేసింది

By

Published : Sep 11, 2020, 3:04 PM IST

హైదరాబాద్ టప్పచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాహిద్ నగర్​లో భర్త వేధింపులు తట్టుకోలేక భర్తను చంపింది ఓ భార్య. స్థానికంగా నివాసముండే అస్లాంకి 20 రోజుల క్రితం సమ్రేన్​తో వివాహమైంది. అప్పటి నుంచి అస్లాం మద్యం సేవించి భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ రోజు ఉదయం కూడా మద్యం సేవించి... భార్యను కొట్టాడు. తట్టుకోలేకపోయిన సమ్రేన్ రోకలిబండతో భర్త తలపై కొట్టింది.

వెంటనే తీవ్ర రక్తస్రావంతో అస్లాం స్పృహ తప్పిపోగా.. కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:భర్త మార్కెట్​కు వెళ్లొచ్చేలోగా.. అదృశ్యమైన భార్య

ABOUT THE AUTHOR

...view details