తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మెడకు టవల్​ బిగించి భర్తను హత్య చేసిన భార్య! - సంగారెడ్డి జిల్లా హత్య వార్తలు

సంగారెడ్డి జిల్లా భానూరు గ్రామానికి చెందిన మంగలి సత్యనారాయణ హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. భర్త మెడకు టవల్​ బిగించి కాలువలోకి నెట్టేసి బండరాయితో మోదినట్లు మృతుడి భార్య విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

wife killed husband at patancheru mandal
సంగారెడ్డి జిల్లాలో హత్య

By

Published : Oct 29, 2020, 10:56 AM IST

ఈనెల 26న సంగారెడ్డి జిల్లా భానూరు గ్రామానికి చెందిన మంగలి సత్యనారాయణ అతని భార్య మనీలాతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సత్యనారాయణ హత్యకు గురయ్యాడు.

భర్త స్నేహితులు వచ్చి కత్తులతో బెదిరించి హత్య చేశారని తెలిపిన మనీలాపై అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తన భర్త మెడకు టవల్​ బిగించి బండరాయితో మోది హత్య చేసినట్లు మనీలా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details