భర్త వేధింపులు భరించలేక భార్య కుమారుని సాయంతో భర్తను కొట్టి చంపేసింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతల్‌చెరు గ్రామానికి చెందిన అంబటి నర్సింహులు భార్య నీలమ్మలకు మురళి మోహన్, సాయిబాబ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందరికి వివాహాలు జరిగాయి. నర్సింహులు ఓ ఫార్మా పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు నచ్చజెప్పినా మనస్పర్థలు తొలగలేదు.
కుమారుని సాయంతో భర్తని చంపేసిన భార్య - కుమారుని సాయంతో భర్తను చంపిన భార్య
భర్త పెట్టే చిత్రహింసలను భరించలేక కన్న కొడుకు సాయంతో భార్య, భర్తను దారుణంగా హత్యచేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతల్‌చెరు గ్రామంలో జరిగింది.
భార్యాపిల్లలతో తరచూ గొడవలు పడుతూ వేధించేవాడు. శుక్రవారం అర్ధరాత్రి మళ్లీగొడవ జరిగింది. కోపోద్రిక్తులైన భార్య నీలమ్మ, పెద్దకుమారుడు మురళిమోహన్‌తో కలసి రోకలిబండతో నర్సింలుపై దాడి చేశారు. ఆ క్రమంలో తలపై తగలడం వల్ల నర్సింహులు అక్కడికక్కేడే మృతి చెందాడు. విషయం శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవ పరీక్షకోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య నీలమ్మ, మురళిమోహన్‌ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. బందువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు