తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భర్త వివాహేతర సంబంధం.. చితకబాదిన భార్య - శక్తి నగర్​లో వివాహేతర సంబంధం వార్తలు

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి అతడిని చితకబాదింది భార్య. వనస్థలిపురం పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమె ఫిర్యాదుతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

wife fired on husband illegal relation attacked on both
భర్త వివాహేతర సంబంధం.. చితకబాదిన భార్య

By

Published : Dec 16, 2020, 8:15 AM IST

Updated : Dec 16, 2020, 9:07 AM IST

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య చితకబాదిన ఘటన వనస్థలిపురం పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. కరీంనగర్​కు చెందిన పద్మకు రంగారెడ్డి జిల్లా చింతల్​కుంటకు చెందిన శ్రీనివాస్​తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయి పదేళ్లైనా పిల్లలు లేరని వేరొక మహిళతో శ్రీనివాస్​ సన్నిహితంగా ఉంటున్నాడు.

భర్త వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భార్య పద్మ.. తన తండ్రితో కలిసి వారిద్దరూ ఉన్న ఇంటికి వెళ్లి వారిని చితకబాదింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనివాస్​, మహిళను అదుపులోకి తీసుకున్నారు.

భర్త వివాహేతర సంబంధం.. చితకబాదిన భార్య

ఇదీ చదవండి:పట్టపగలు నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

Last Updated : Dec 16, 2020, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details