నిజామాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రగతినగర్లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కోటగిరి మండలం ఏతోండ గ్రామానికి చెందిన శ్యామల, భర్త సాయిలుతో కలిసి ఎల్లమ్మ గుట్టలో నివాసం ఉంటూ... ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది.
బైక్ను ఢీకొట్టిన ఇసుకట్రాక్టర్... ఒకరు మృతి - road accident news
విధులు ముగించుకుని భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న దంపతులను ఇసుకట్రాక్టర్ రూపంలో మృత్యువు ఎదురైంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా... భర్త తీవ్రంగా గాయపడ్డారు.
wife died and husband injured in accident
పని ముగించుకుని తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఇటుక ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్యామల అక్కడికక్కడే మృతి చెందగా... భర్త సాయిలు తీవ్ర గాయలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.