భర్త మరణవార్త విన్న భార్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొండంపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన డా. సలాది రామారావు (75) గుండెపోటుతో మరణించారు. తన భర్త మరణించాడన్నవార్త తెలుకుకున్న భార్య నిర్మల (65) సైతం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు.. మరణంలోనూ వీడిపోలేదంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
భర్త మరణ వార్త విన్న భార్య అక్కడికక్కడే మృతి - శ్రీకాకుళం జిల్లాలో భర్యాభర్తల మృతి వార్తలు
వారిద్దరూ అన్యోన్య దంపతులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. మరణంలోనూ వీరి బంధం అలాగే ఉంది. భర్త మరణించాడని తెలియగానే.. భార్య సైతం ప్రాణాలు వదలింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేట గ్రామంలో జరిగింది.
భర్త మరణ వార్త విన్న భార్య అక్కడికక్కడే మృతి