భర్త ఇంటిముందు భార్య ఆందోళన హైదరాబాద్ మధురానగర్‌లో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని ప్రియురాలితో ఉడాయించాడంటూ ధర్నా చేసింది. ఖమ్మం జిల్లా జమలాపూర్‌కు చెందిన క్రిష్ణశంకర్, లక్ష్మి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ మధురానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 40 రోజుల క్రితం భర్త పిల్లల్ని తీసుకుని ప్రియురాలితో వెళ్లిపోయాడు. తనకు పిల్లలు కావాలంటూ ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు లక్ష్మి ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ భర్త క్రిష్ణశంకర్‌తో ఫోన్ లో మాట్లాడామని... వీరి విడాకుల కేసు కోర్టులో ఉన్నట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.