ఇష్టంలేని పెళ్లి చేశారనీ... తన భర్త అందంగా లేడనే మనస్తాపంతో వివాహిత ఉరేేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా అనకాపల్లిలో కృష్ణాపురం కాలనీకి చెందిన షేక్ కరీమా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మృతురాలికి దగ్గర బంధువైన రహతుల్లాకు ఇచ్చిన 2019లోనే పెళ్లి చేశారు.
దారుణం: భర్త అందంగా లేడని భార్య బలవన్మరణం - krishnapuram recent crime news
ప్రాణం కంటే అందమే ఎక్కువయ్యిందా వివాహితకు. తనకు తాళి కట్టిన భర్త అందంగా లేడని లేఖ రాసి మరీ ప్రాణం తీసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.
భర్త అందంగా లేడని భార్య ఆత్మహత్య..
భార్యాభర్తలిద్దరూ విశాఖపట్నంలో ఉండేవారు. 2020 మే నెలలో కరీమా పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 13న తనకు ఇష్టం లేని పెళ్లి చేశారినీ... భర్త అందగా లేడని లేఖ రాసింది. తను ఎవరికీ భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొంది. అనంతరం ఈ నెల 15న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు, మృతురాలు రాసిన లేఖను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు