తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య ఆత్మహత్య.. భర్తనే హత్య చేశాడా? - వికారాబాద్​ జిల్లా తాజా వార్తలు

ఓ ఇంట్లో మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్తనే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోజూ మద్యం తాగి వచ్చి తనను హింసించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Wife commits suicide at vikarabad
భార్య ఆత్మహత్య.. భర్తనే హత్య చేశాడా?

By

Published : Aug 19, 2020, 7:00 AM IST

వికారాబాద్​లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్​గృహకల్ప బ్లాక్ నంబర్ 33లో ఆనంద్-భవిత(21)గత కొంత కాలంగా నివసిస్తున్నారు. ఆనంద్ రోజూ మద్యం తాగి వచ్చి భవితతో గొడవ పడేవాడని.. భర్తనే ఆమెను హత్యచేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్ల క్రితం మోమిన్​పేట మండలం దుర్గంచెర్వుకు చెందిన భవిత(21)కి బంట్వారం మండలం తోర్మామిడికి చెందిన ఆనంద్​తో వివాహం జరిగింది. వారికి ఏడాది వయసు గల కుమార్తె ఉంది. రేషన్ డీలర్ వద్ద పని చేసే ఆనంద్ మద్యానికి బానిసై భార్యతో గొడవకు దిగేవాడని వారు ఆరోపిస్తున్నారు. ఆమె వేధింపులతో ఆత్మహత్య చేసుకుందా ? భర్త చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :జారీ చేసిన చెక్కుల చెల్లింపులు నిలిపివేస్తారా..?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details