భర్త వేధింపులతో పాటు పడక గదిలో తీసుకున్న ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో అప్లోడ్ చేయటం వల్ల... అవమానం భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్‌పల్లికి చెందిన రఫికి లక్ష్మీపూర్‌కు చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. గత కొంతకాలంగా కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడుతున్నాడు.
వాట్సప్ స్టేటస్‌లో పడకగది ఫొటోలు... భార్య ఆత్మహత్యాయత్నం
పడకగదిలో తీసుకున్న ప్రైవేటు ఫొటోలను భర్త వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడన్న అవమానంతో భార్య శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది.
వాట్సప్ స్టేటస్‌లో పడకగది ఫొటోలు... భార్య ఆత్మహత్యాయత్నం
అంతేగాక... పడక గదిలో తీసుకున్న ఫొటోలను పైశాచికంగా వాట్సాప్ స్టేటస్‌లో అప్లోడ్ చేశాడు. అవమానం భరించలేక వివాహిత ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బాధితురాలిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు భర్త రఫిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.