పండుగపూట విషాదం.. దంపతుల మృతి - సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో విషాదం
సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో విషాదం
12:29 January 14
సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో విషాదం
పండుగ పూట.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లింగంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దంపతుల మధ్య చెలరేగిన వివాదం ముదిరి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఉన్న భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమెను రక్షించబోయిన భర్తకు మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా... దంపతులు మృతి చెందారు.
Last Updated : Jan 14, 2021, 1:17 PM IST