సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో రమేష్, మంజు నివాసముంటున్నారు. రమేష్ బంగారు వ్యాపారం చేసేవాడు. ఇటీవల వారి ఏకైక కుమారుడు అనారోగ్యం పాలై మృతి చెందడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పోలీసులు తెలిపారు.
కొడుకు మృతిని తట్టుకోలేక... తల్లిదండ్రులు అదృశ్యం - సికింద్రాబాద్ వార్తలు
ఏకైక పుత్రుని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. అనారోగ్యం రూపంలో మృతువు కుమారుడిని కబళించింది. కొడుకు మృతి తట్టుకోలేని తల్లిదండ్రులు... ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మారేడుపల్లిలో చోటు చేసుకుంది.
కొడుకు మృతిని తట్టుకోలేక... తల్లిదండ్రులు అదృశ్యం
కొడుకు మృతి తట్టుకోలేక దంపతులు ఇంటి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి:పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత