హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్, హుమాయూన్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధుల్లోని అక్రమ గుట్కా స్థావరాలపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్కాను పూర్తిగా బంద్ చేసినా.. అక్రమంగా గుట్కా నిల్వ చేస్తున్నారనే సమాచారంతో దాడి చేసినట్లు వెస్ట్ జోన్ పోలీసులు తెలిపారు.
గుట్కా స్థావరాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్టు - West Zone Task Force police raid on gutka bases
హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్, హుమాయూన్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో అక్రమ గుట్కా స్థావరాలపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.2,85,000 విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో గుట్కా స్థావరాలపై పోలీసుల దాడి
ఈ దాడిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 2 లక్షల 85 వేల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఏ1 నిందితుడు మురారి లాక్, ఏ2 ఖాదిర్, ఏ3 అజమత్, ఏ4 సాంబ శివలను వెస్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'