తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2020, 12:08 PM IST

ETV Bharat / jagte-raho

వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వాటర్​ ట్యాంకర్​

భారీ వర్షాలకు నీటిని సరఫరా చేసే వాటర్​ ట్యాంకర్‌ కొట్టుకుపోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొన్యాల వద్ద చోటుచేసుకుంది.

Water tanker washed away in a flood at sangareddy district
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వాటర్​ ట్యాంకర్​

సంగారెడ్డి జిల్లా హత్పూర మండలం కొన్యాల వద్ద మంజీర నదిపై చెక్‌డ్యాం నిర్మాణ పనులు చేపడుతున్నారు. అక్కడ నీటికోసం ట్యాంక్‌ర్‌ను వినియోగిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరద ప్రవాహం భారీగా రావడం వల్ల ట్యాంకర్‌ కొట్టుకుపోయింది.

అది మెదక్‌ జిల్ల చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌ పాత వంతెన ఫిల్లర్‌కు తట్టుకుని ఆగింది. నీటిప్రవాహం తగ్గడం వల్ల ట్యాంకర్‌ అక్కడి కనిపించింది. యాజమాని వచ్చి జేసీబీ సాయంతో ట్యాంకర్‌ను పైకి తీశారు.

ఇదీ చూడండి:వరద నుంచి త్రుటిలో తప్పించుకున్న 8 మంది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details