వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్, వేలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరుగా జరిపిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బియ్యం విలువ సుమారు రూ.2 లక్షల 30 వేలు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఐదుగురు నిందితులని అరెస్టు చేసి... ఒక డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వేర్వేరు తనిఖీల్లో 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - తెలంగాణ వార్తలు
వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన వేర్వేరు తనిఖీల్లో 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.2లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు. ఐదుగురు నిందితులని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
వేర్వేరు తనిఖీల్లో 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని వీరంతా తక్కువ ధరకు కొనుగోలు చేసి... మహరాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితులని, స్వాధీనం చేసుకున్న బియ్యం, వాహనాన్ని సంబంధిత పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐలు నంధీరామ్ నాయక్, మధు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కట్నం వేధింపులతో వివాహిత బలి.. ఆవేదనతో భర్త ఆత్మహత్యాయత్నం