ఇటీవల అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో ఖానాపూర్‌కు చెందిన యువతి హత్య కేసులో నిందితుడు ఒక్కడే అని వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. 2012 నుంచి స్వేతా, శ్రీనివాసులు ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఆయన చెప్పారు.
వేధింపులు తట్టుకోలేక... ప్రియురాలిని చంపేశాడు: డీఎస్పీ - Khanapur woman murder accused arrested
అమరచింతలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రేమించిన వాడే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు.
ఇటీవల లాక్డౌన్లో శ్రీనివాసులు ఇంట్లో ఒత్తిడి మేరకు తమ కులం అమ్మాయిని చేసుకున్నాడని ఇది జీర్ణించుకోలేని స్వేతా తరుచు శ్రీనును ఫోన్లో వేధిస్తుండేదని తెలిపారు. ఈ క్రమంలో స్వేతాను వదిలించుకోవడం ఒక్కటే మార్గమని భావించి హైదరాబాద్ నుంచి వస్తున్న స్వేతాను జడ్చర్ల వద్ద బస్ దిగమని చెప్పి తన బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకుని జడ్చర్ల నుంచి ఆమెను బైక్‌పై మహబూబ్‌నగర్, దేవరకద్ర, మరికల్ అమరచింత మీదుగా తండా వైపు వెళ్లే సమయంలో మరోసారి తన పెళ్లి ప్రస్తావన చేసినట్లు తెలిపారు.
ఎలాగైనా తన భార్యకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని లేదంటే పరువు తీస్తానంటూ బెదిరించేదని డీఎస్పీ చెప్పారు. దీనితో సహనం కోల్పోయిన శ్రీను తన వెంబడి తీసుకువచ్చిన తాడుతో గొంతుకు ఉరివేసి.. చనిపోయిందని నిర్ధరించుకుని పత్తి చెనులోకి ఈడ్చు కెళ్లి... తన బండిలోఉన్న పెట్రోల్‌ను తీసి కాల్చి వేశాడని డీఎస్పీ వివరించాడు.
- ఇదీ చదవండి:తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ