వెంకటేశం అనే వ్యక్తి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో వీఆర్వోగా పని చేస్తున్నారు. సరిగా పనిచేయడం లేదని అతన్ని కలెక్టర్ కార్యాలయానికి పంపారు. తర్వాత చేగుంట మండలానికి పంపారు. నర్సాపూర్‌లో పని చేస్తున్నప్పటి నుంచి జీతం రావడం లేదని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయమై నర్సాపూర్ ఎమ్మార్వో కార్యాలయానికి పలుమార్లు వెళ్లినా.. ఇవ్వలేదన్నారు.
ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో.. అధికారుల ఒత్తిడే కారణమా? - మెదక్ జిల్లా వార్తలు
వీఆర్వో ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చండూర్లో చోటుచేసుకుంది. అధికారుల ఒత్తిడి వల్ల తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డారని మృతిని భార్య ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో.. అధికారుల ఒత్తిడే కారణమా?
దీంతో విసుగు చెందిన వీఆర్వో వెంకటేశం.. భార్య, పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అధికారుల ఒత్తిడితోనే తన భర్త ప్రాణం తీసుకున్నాడని భార్య సువర్ణ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.