అనంతపురం జిల్లా నార్పల మండలం ఉయ్యాలకుంటాలో సుబ్రమణ్యం గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ఓ వివాహితకు ప్రేమ లేఖ రాసిచ్చాడు. ఇదేనా ఒక వాలంటీర్ పద్ధతి అంటూ ఎంపీడీవో కార్యాలయం ముందు వివాహిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
వాలంటీర్ ప్రేమాయణం... బంధువుల దేహశుద్ధి
ఓ వివాహితకు గ్రామ వాలంటీర్ ప్రేమ లేఖ ఇచ్చాడు. గ్రామ వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని ఆ వివాహిత కుటుంబ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రేమ లేఖ ఇచ్చిన వాలంటీర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
village volunteer
సుబ్రమణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న ప్రభు.. ఈ వివాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడనీ, అతడపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రేమ లేఖ అందించిన వాలంటీర్ సుబ్రమణ్యంకు వివాహిత కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.