తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాలంటీర్ ఆత్మహత్యాయత్నం.. సీఎంకు లేఖ - sattenapalli latest news

నిజాయతీగా పనిచేస్తున్నప్పటికీ తనను ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్​కు లేఖ రాసి ఓ దివ్యాంగురాలైన వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన జరిగింది. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

volunteer suicide in andhra pradesh
సీఎంకు లేఖ రాసి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 25, 2020, 8:51 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు లేఖ రాసి దివ్యాంగురాలైన వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. ఐదో వార్డు సచివాలయం వాలంటీరు మహంకాళి అంకేశ్వరి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించించింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్​కు తరలించారు.

నా ఆత్మహత్యకు అతనే కారణం

'తాను ఆరో వార్డు రేషన్ డీలరు వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు.. నిజాయతీగా పనిచేస్తున్నప్పటికీ అనర్హురాలికి చేయూత పథకం లబ్ధి అందలేదనే కారణాన్ని చూపించి ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు'. అని వాలంటీరు వద్ద లభ్యమైన లేఖలో ఆమె పేర్కొంది. తన ఆత్మహత్యకు రేషన్ డీలర్ కారణమని ఆరోపిస్తూ వాలంటీర్లూ క్షమించండి... అమ్మా క్షమించు అని ఆమె లేఖలో రాసింది.

ఉద్యోగం నుంచి తొలగించాలని కమిషనర్​కు లేఖ

అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందజేయట్లేదని... సకాలంలో తమకు పథకాలు అందేలా చూడట్లేదని ఆరో వార్డుకు చెందిన ప్రజలు వాలంటీర్ అంకేశ్వరిపై స్పందనలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్​కు లేఖ పంపారు. తనను విధుల నుంచి తొలగిస్తారని భావించి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు భావిస్తున్నామని ఎస్సై చెప్పారు.

సీఎంకు లేఖ రాసి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

ఇవీచూడండి:సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​ హత్య కేసులో భార్య హస్తం

ABOUT THE AUTHOR

...view details