బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన యద్ధనపూడి మండలం సురవరపుపల్లె గ్రామంలో జరిగింది. వాలంటీర్‌గా పని చేస్తున్న ఏ. రాజేశ్.. మద్యం సేవించి రాత్రి 9 గంటలకు ఓ ఇంటి వద్దకు వెళ్లాడు. పొలం పాసుబుక్, ఆధార్ కార్డు కావాలని అడిగాడు.
మైనర్‌తో అసభ్య ప్రవర్తన.. వాలంటీర్‌పై పోక్సో కేసు
ఏపీలోని ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం సురవరపుపల్లె గ్రామ వాలంటీర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో మైనర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి, ఆమె తల్లిపై దాడికి పాల్పడినందుకుగాను బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మైనర్‌తో అసభ్య ప్రవర్తన.. వాలంటీర్‌పై పోక్సో కేసు
ఈ క్రమంలో ఇంటి యజమాని భార్య వాటిని తెచ్చేందుకు లోపలికి వెళ్లగా.. అక్కడే ఉన్న కుమార్తెతో వాలంటీర్ అసభ్యంగా ప్రవరించాడు. బాలిక కేకలు వేయగా.. ఆమె తల్లి అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వాలంటీర్ ఆమెపైనా దాడికి దిగాడు. బాధితురాలు మైనర్ అయినందున ఆమె ఫిర్యాదుపై పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి