ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న ఓ క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కొంత కాలంగా గ్రామానికి చెందిన పలువురు బాలురు ఈ క్వారీలో ఈతకు దిగుతున్నారని స్థానికులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లిన కొంత మంది బాలురు అందులోకి దిగగా.. నీల కాయల బాలాజీ(12), పొడుగు గిరీశ్(11), నందనవనం శరత్ చంద్ర(12) అనే ముగ్గురు బాలురు మృతి చెందారు. పిల్లల మరణంతో తల్లిద్రండులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి - క్వారీలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
![క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9283246-866-9283246-1603447081705.jpg)
క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి