తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుప్తనిధుల కోసం తవ్వకాలు.. పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు - గుప్తనిధుల కోసం వచ్చిన వ్యక్తులను పట్టుకున్న వెల్దండ పోలీసులు

నాగర్​కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మజీద్ వెనకాల నివాసాల మధ్యలో ఉన్న ఆలయంలోకి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు దూరి.. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టగా.. గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

villagers handedover unknown people to police who tried to excavate secret funds at temple
గుప్తనిధుల కోసం తవ్వకాలు.. పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు

By

Published : Sep 23, 2020, 11:21 PM IST

నాగర్​కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మజీద్​ వెనకాల ఉన్న పురాతన శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. నివాసాల సమీపంలో ఉన్న పురాతన దేవాలయంలో ఐదుగురు వ్యక్తులు తవ్వకాలు చేస్తున్నట్లు శబ్దాలను గుర్తుపట్టిన గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చి వారిని పోలీసులకు అప్పగించారు.

మజీద్​ వెనకాల ఉన్న ఆలయం నుంచి తవ్వకాలు జరుగుతున్నట్లు శబ్దాలను విన్న గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. గ్రామస్థులు దేవాలయాన్ని చుట్టుముట్టి వారిని పట్టుకుని ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇచ్చారని అందుకే పోలీసులకు అప్పజెప్పామని పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు.

ఇదీ చూడండి:'విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details