ఏపీ విజయవాడ హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు దిశ పోలీసులు నిందితుడిని విచారించారు. విచారణలో భాగంగా నిందితుడి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. నాగేంద్రను భీమవరం తీసుకెళ్లిన దిశ టీం.. యువతి చదివిన కాలేజీకి వెళ్లి విచారించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించామని దిశ ఏసీపీ వివినాయుడు తెలిపారు.
విజయవాడ యువతి హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్ - విజయవాడ తాజా వార్తలు
ఏపీ విజయవాడ యువతి హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తీసుకెళ్లారు. నేటితో నాగేంద్రబాబు కస్టడీ గడువు ముగియగా... ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది.
విజయవాడ యువతి హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్
ఇప్పటికే యువతి స్నేహితులను విచారించామన్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియటం వల్ల విజయవాడలోని ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. న్యాయస్థానం.. 14 రోజుల రిమాండ్ పొడిగించగా నాగేంద్రబాబును రాజమండ్రి కేంద్ర కారాగారానికి తీసుకెళ్లారు.