కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట్ చెందిన వెంకటరెడ్డి,ఉమా దంపతులు తక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని కొంత మంది గ్రామస్థులను నమ్మించారు. బీర్షెబా కంపెనీ పేరుతో సుమారు 100 మందికి పైగా గ్రామస్థుల వద్ద సుమారు కోటి యాబై లక్షల వరకు వసూల్ చేశారు. చివరికి కంపెనీ యాజమాన్యం బోర్డు తిప్పేసింది.
బీర్షెబా స్కాంలో బాధితులు ఆందోళన
అత్యాశ చివరికి నష్టాన్ని మిగులుస్తోంది మరోసారి నిరూపితమైంది. కామారెడ్డి జిల్లా లచ్చపేట్లో ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో ఉన్న డబ్బులు పోగొట్టుకున్నారు కొందరు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
ఆందోళన చెందిన బాధితులు వెంకటరెడ్డిని డబ్బులు అడగడం మొదలు పెట్టారు. రేపు ఇస్తాం, తర్వాత ఇస్తామని రోజులు గడిపారు ఆ దంపతులు. ఒత్తిడి పెంచడం వల్ల ఈరోజు ఇస్తానని ఇంటికి రమ్మన్నారు. బాధితులు ఆదివారం ఉదయం వారి ఇంటికి వెళ్లేసరికి వెంకటరెడ్డి, ఉమా తాళం వేసి పారిపోయారు. ఆగ్రహించిన 50 మంది గ్రామస్థులు నిందితుల ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. బీర్షెబా కంపెనీ రూ. 200 కోట్లు బాధితుల నుంచి వసూల్ చేసి బోర్డు తిప్పేసింది.
ఇదీ చదవండి:శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!