నిజామాబాద్లో ఓ వెటర్నరీ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణ శివారులోని ముబారక్నగర్కు చెందిన దమ్మాయి సంతోష్... మక్లూర్లో వెటర్నరీ వైద్యునిగా పని చేస్తున్నాడు. కరోనా దృష్ట్యా... గత కొన్ని రోజుల నుంచి ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉంటున్నాడు.
ఉరేసుకుని వెటర్నరీ వైద్యుడు బలవన్మరణం... - murder news
నిజామాబాద్లో ఓ పశువుల వైద్యుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా దృష్ట్యా స్వీయ నిర్బంధంలో ఉన్న వైద్యుడు తెల్లారి చూసేటప్పటికీ విగతజీవిగా వేలాడుతూ కన్పించాడు.
veternary doctor suicided in nizamabad
నిన్న రాత్రి కూడా తన గదిలోకి వెళ్లిన సంతోశ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోవటం వల్ల కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి చూడగా ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఎవరికీ తెలియ రావటం లేదు.
ఇదీ చూడండి:'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు