జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన తెరాస అభ్యర్థి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో తన టిక్‌టాక్ వీడియోలను అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
అభ్యంతకర పోస్టులపై కార్పొరేటర్ ఫిర్యాదు - corporater complaint on social media videos to cyber crime police in hyderabad
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు సైతం సైబర్ వేధింపులకు గురవుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన వెంగళరావునగర్ డివిజన్ తెరాస అభ్యర్థి దేదీప్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో తన టిక్‌టాక్ వీడియోలను అసభ్యకర రీతిలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
![అభ్యంతకర పోస్టులపై కార్పొరేటర్ ఫిర్యాదు vengal rao nagar division trs corporater](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10067575-132-10067575-1609397323466.jpg)
అభ్యంతకర పోస్టులపై కార్పొరేటర్ ఫిర్యాదు
తనపై అభ్యంతకర వీడియోలు పెడుతూ... అవమానిస్తున్నారని వెల్లడించారు. పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.