ఏపీలోని వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను... ఖమ్మం జిల్లా పెద్ద గోపవరానికి తీసుకువచ్చారు. గ్రామ చుట్టుపక్కల నుంచి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులర్పించారు. ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్, రాష్ట్ర విత్తానాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి... మృతుల కుటుంబాలను ఓదార్చారు.
గోపవరానికి వేదాద్రి రోడ్డు ప్రమాద మృతదేహాలు - వేదాద్రి రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా వేదాద్రి రోడ్డు ప్రమాద మృతదేహాలు గోపవరం తరలించారు. జిల్లా ప్రజాప్రతినిధులు మృతుల కుటుంబాలను పరామర్శించారు.
![గోపవరానికి వేదాద్రి రోడ్డు ప్రమాద మృతదేహాలు Vedadri road accident bodies Passing to Gopavaram in khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7664440-821-7664440-1592461483555.jpg)
Vedadri road accident bodies Passing to Gopavaram in khammam district
ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ప్రమాదంలో మెుత్తం 12 మంది మృతి చెందగా... పెద్ద గోపవరానికి చెందిన ఏడుగురు... జమలాపురానికి చెందిన ఇద్దరు... కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. రెండు గ్రామాలు శోకసంద్రంలో మునిగాయి.
వేదాద్రి రోడ్డు ప్రమాదం మృతదేహలు గోపవరం తరలింపు