హైదరాబాద్ వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ మైసమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన 3.5 తులాల బంగారు, 103 తులాల వెండి అభరణాలు, రూ. 36 వేల నగదు, ఆటో, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాహేబ్ నగర్‌కు చెందిన మైసమ్మ స్థానిక శ్మశానవాటికలో పనిచేస్తుంది. అయితే ఆ ఇంటిపక్కనే ఉంటున్న సతీశ్ ఆటోలో పలుమార్లు శ్మశానవాటిక వద్దకు వేళ్లేవాడు.
కొత్త ఆటో కొనుక్కుందామనే హత్య చేశాడు: ఇంఛార్జ్ ఏసీపీ - వనస్థలిపురం పోలీసుల తాజా వార్తలు
సాహెబ్ నగర్ మైసమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించి.. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మైసమ్మను చంపి నగలు దొంగలించి కొత్త ఆటోను కొనుక్కోవడమే నిందితుడి ఉద్దేశమని వనస్థలిపురం ఇంఛార్జ్ ఏసీపీ శంకర్ వెల్లడించారు.
అయితే ఎలాగైనా మైసమ్మను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు అమ్మి కొత్త ఆటో కొనుక్కోవాలనుకున్నట్లు సతీశ్ భావించినట్లు వనస్థలిపురం ఇంఛార్జ్ ఏసీపీ శంకర్ తెలిపారు. పథకం ప్రకారమే మైసమ్మకు కల్లు తాగించి.. అనంతరం ఆటోలో తీసుకెళ్లి కొహెడ సమీపంలో కత్తితో మెడకోసి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాళ్లకు ఉన్న వెండి కడియాలు రాకపోవడం వల్ల కాళ్లు నరికి తీసుకొని.. తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు శంకర్ వివరించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:తలపై బండరాయితో మోది హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు