తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యూపీలో సిక్కుల ఊచకోతపై విచారణకు సిట్

1984లో సిక్కుల ఊచకోతకు దారితీసిన పరిణామాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని యూపీ ప్రభుత్వం నియమించింది.

By

Published : Feb 6, 2019, 5:53 AM IST

Updated : Feb 6, 2019, 7:24 AM IST

అల్లర్లకు వ్యతిరేకంగా నిరసనలు(పాత చిత్రం)

అల్లర్లపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం
1984లో సిక్కుల ఊచకోతకు దారితీసిన పరిణామాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని యూపీ ప్రభుత్వం నియమించింది.

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం కాన్పుర్​లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేసి ఆరు నెలల్లో సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులలో ఆదేశించింది.

ఉత్తర ప్రదేశ్​ మాజీ డీజీపీ అతుల్​ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరిలో విశ్రాంత జిల్లా న్యాయమూర్తి సుభాష్ చంద్ర అగర్వాల్, విశ్రాంత అదనపు డైరెక్టర్ యోగేశ్వర్ కృష్ణ శ్రీవాస్తవ ఉన్నారు.

1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన అనంతరం కాన్పుర్​లో జరిగిన అల్లర్లలో 125 మందికి పైగా మరణించారు. ఊచకోతపై సిట్​ విచారణ చేపట్టాలని వేసిన వ్యాజ్యంపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం 2017 ఆగస్టులో ఆదేశించింది.

Last Updated : Feb 6, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details