దుండగుల బీభత్సం... ఇళ్లపై బీరు సీసాలు, రాళ్లతో దాడి - stone attacks in kukatpally hyderabad
![దుండగుల బీభత్సం... ఇళ్లపై బీరు సీసాలు, రాళ్లతో దాడి unknowns attacks on houses in Kukatpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9350475-1065-9350475-1603948927757.jpg)
09:35 October 29
దుండగుల బీభత్సం... ఇళ్లపై బీరు సీసాలు, రాళ్లతో దాడి
హైదరాబాద్ కూకట్పల్లి దాయారుగూడలో గుర్తుతెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో బీరు సీసాలు, రాళ్లతో ఇళ్లపై దాడిచేశారు.
వరద బాధితులకు పరిహారం అందించే విషయంలో అన్యాయం జరుగుతోందంటూ స్థానికులు, నేతలు.. బుధవారం ధర్నా చేశారు. ఆందోళన చేసిన వారి ఇళ్లపైనే దాడికి పాల్పడ్డారు. తెరాస నేతలే దాడిచేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీచూడండి:దీక్షిత్రెడ్డిని కిడ్నాప్ చేసి అన్నారం గుట్టవరకు ఎలా తీసుకెళ్లారు?