మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల మునిపుట్ట వద్ద గుర్తుతెలియని ఓ మహిళ శవం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు వెల్లడించారు. మునిపుట్ట ప్రాంతంలో పశువుల కాపరులకు దుర్గంధం రావడంతో వెళ్లి చూశారు. కుళ్లిన స్థితిలో ఒక మృతదేహం కనిపించడంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పాపన్నపేట పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న 50 సంవత్సరాల వయసు గల మహిళా మృతదేహాన్ని పరిశీలించారు.
ఏడుపాయల మునిపుట్ట వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం - medak latest crime news
ఏడుపాయల మునిపుట్ట వద్ద ఓ మహిళ శవం కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ పేర్కొన్నారు. పశువుల కాపరుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి ఎడమ, కుడి మోచేతులపై పచ్చబొట్లు ఉన్నాయని తెలిపారు.
ఏడుపాయల మునిపుట్ట వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో.. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహానికి ఎడమ, కుడి మోచేతులపై పచ్చబొట్లు, ఇత్తడి గాజులు, రాగి ఉంగరం ఉన్నాయని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: షేర్‌చాట్‌లో వీడియో తీస్తుండగా ప్రమాదం... చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు