మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రానికి సమీపంలో అమ్మాపూర్ రోడ్డులో రైల్వే వంతెన కింద అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. జన సంచారం లేని ఆ ప్రదేశంలో అటుగా వెళ్లిన పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
రైల్వే వంతెన కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం - mahabubnagar crime updates
అమ్మాపూర్ రోడ్డులో రైల్వే వంతెన కింద కుళ్లిన స్థితిలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్ర సమీపంలో చోటు చేసుకుంది.
రైల్వే వంతెన కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి ఆకుపచ్చ కాటన్ చీర, ఎర్రటి చెప్పులు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు