ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు గుజ్జనగుండ్ల కూడలి వద్ద మాయమాటలు చెప్పి బాలుడ్ని అపహరించేందుకు భారాభర్తలు యత్నించారు. దీన్ని పనిగట్టిన బాలుడు వారితో వెళ్లడానికి నిరాకరించాడు. వారి మీద అనుమానంతో కొంత దూరం ఇద్దర్నీ వెంబడించాడు. వారి వెంట కొంతదూరం వెంబడించగా... బుర్ఖాల్లో ఉన్న ఇద్దరిలో ఒకరు మగవాడే అయి ఉండటం గమనించి కుటుంబ సభ్యులకు, స్థానికులకు సమాచారమిచ్చాడు.
బాలున్ని ఎత్తుకెళ్లాలని చూశారు.. దెబ్బలు తిన్నారు - గుంటూరులో కిడ్నాప్ తాజా వార్తలు
ఏపీలోని గుంటూరు గుజ్జనగుండ్ల కూడలి వద్ద మాయమాటలు చెప్పి.. పిల్లలను అపహరించేందుకు ప్రయత్నించిన భార్యాభర్తలకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఓ బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలుడు స్థానికులకు సమాచారమిచ్చాడు.
బాలున్ని ఎత్తుకెళ్లాలని చూశారు.. దెబ్బలు తిన్నారు
వారిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పట్టాభిపురం పోలీసులకు అప్పగించారు. వారి వద్ద ఉన్న సంచిలో ఓ కత్తి, తాడు, గ్లౌజులు, కారం ప్యాకెట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ భార్యాభర్తలిద్దరూ మాచర్ల నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. దుండగులు గుంటూరుకు ఎందుకు వచ్చారు. పిల్లాడితో ఎందుకు మాట్లాడారు అనే కోణాల్లో విచారిస్తున్నారు.