తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మహిళ దారుణ హత్య.. దాని కోసమేనా..? - నిజామాబాద్​లో మహిళ దారుణ హత్య

వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటున్న ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన సిరికొండ మండలం న్యావనందిలో శనివారం జరిగింది. ఆభరణాల కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మహిళ హత్య.. బంగారం కోసమేనా..?
మహిళ హత్య.. బంగారం కోసమేనా..?

By

Published : Oct 4, 2020, 8:20 AM IST

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలో దారుణం జరిగింది. పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. గ్రామానికి చెందిన పుర్రె మమత(35) రోజు మాదిరిగానే శనివారం కూడా తమ పొలంలో పనికి వెళ్లింది. రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల... కుటుంబ సభ్యులు పరిసరాల్లో గాలించగా కనిపించలేదు. పొలానికి వెళ్లి చూడగా అక్కడ బురదలో విగతజీవిగా పడి ఉంది.

పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ ప్రసాద్, ఎస్ఐ రాజశేఖర్.. మహిళ మెడలో బంగారు ఆభరణాలు లేనట్లు గుర్తించారు. ఆభరణాల కోసం గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఉంటారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:గల్లంతైన మృతదేహాన్ని వెలికితీసిన గజఈతగాళ్ల బృందం

ABOUT THE AUTHOR

...view details