రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ, భరత్ నగర్ మధ్య రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు.
రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి - సికింద్రాబాద్ తాజా నేర వార్తలు
బోరబండ, భరత్ నగర్ మధ్య రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి
గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో రైల్వే జీఆర్పీ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. యువకుడు చనిపోవడానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాచారం కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఇదీ చూడండి: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు