నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ గ్రామ శివారులో ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై అహ్మద్ అలీ తెలిపారు. శుక్రవారం రాత్రి ట్రాలీ ఆటో ఢీ కొట్టిందని.. మృతిచెందిన వ్యక్తి వివరాలు ఇప్పటి వరకు తెలియదని చెప్పారు.
ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి - nirmal crime updates
ట్రాలీ ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ప్రమాదం జరగగా.. ఇప్పటి వరకు ఆ వ్యక్తి వివరాలు తెలియలేదని ఎస్సై అహ్మద్ అలీ పేర్కొన్నారు.
ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. మృతదేహన్ని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే సోన్ సీఐ 9440900679, ఎస్సై 9440900645 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సులో రూ.1.9 కోట్ల నగదు పట్టివేత