వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.
వనపర్తి నల్ల చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం - వనపర్తి జిల్లా నేర వార్తలు
వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మృతి చెందింది ఎవరు అనేది త్వరలోనే గుర్తిస్తామని అన్నారు. మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వనపర్తి నల్ల చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం
శరీరం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో రెండు మూడు రోజుల క్రితమే చెరువులో పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేసి మరణించింది ఎవరు అనేది త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:నకిలీ చెక్కుతో కాజేయాలనుకున్నారు... కానీ!