ఖమ్మం జిల్లా కరుణగిరి వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కరుణగిరి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - ఖమ్మం జిల్లా నేర వార్తలు
ఖమ్మం జిల్లా కరుణగిరి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరుణగిరి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. అతను ఎవరు?.. మృతుడిది ఆత్మహత్య లేేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇవీచూడండి:వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే.