రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. యూనియన్ బ్యాంక్ ఏటీఎం దోచుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి విఫలయత్నం చేశారు. ఏటీఎంలోకి అర్ధరాత్రి చొరబడిన దుండగుడు చోరీ కోసం యత్నించగా... అదే సమయంలో బ్యాంక్ సైరన్ మోగడంతో పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏటీఎం చోరీకి యత్నం - రంగారెడ్డి జిల్లా నేర వార్తలు
రంగారెడ్డి జిల్లాలో వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన వనస్థలిపురం చోరీ మరువక ముందే దుండగులు అదే జిల్లాలో మరో చోరీకి యత్నించారు. ఓ ఏటీఎం దోచుకోవడానికి గురువారం రాత్రి విఫలయత్నం చేశారు.
![అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏటీఎం చోరీకి యత్నం unknown people tried to theft atm at abdullapurmet in rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9839197-195-9839197-1607664326839.jpg)
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏటీఎం చోరీకి యత్నం
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏటీఎం చోరీకి యత్నం
వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:పెళ్లి రోజు.. సవతి కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య
Last Updated : Dec 11, 2020, 2:09 PM IST