హైదరాబాద్ మూసాపేటలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. నిందితులు మృతదేహాన్ని గూడ్షెడ్ రోడ్డులోని మైసమ్మ చెరువులో పాడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
దారుణం... హైదరాబాద్లో ఓ వ్యక్తి గొంతు కోసి హత్య - etv bharat
గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మూసాపేటలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గొంతు కోసి హత్య చేశారు
వ్యక్తిని ఇక్కడికి తీసుకు వచ్చిన తర్వాత చంపారా లేక ఎక్కడనా చంపి మృతదేహాన్ని తీసుకొచ్చి చెరువులో పాడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి గొంతు కోసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:జంపన్న వాగులో యువకుడు గల్లంతు