కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చనిపోయిన వ్యక్తి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మృతుడి ఒంటిపైన క్రీమ్ కలర్ ఫుల్ షర్టు ధరించి ఉన్నాడు.
పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం
జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని నాగిరెడ్డిపేట్ ఎస్సై రాజయ్య కోరారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.