మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం శేరిపల్లి గ్రామ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. రహదారి పక్కన బురద గుంటలో నగ్నంగా పడి ఉండటంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
బురదగుంటలో నగ్నంగా మృత దేహం.. హత్యగా అనుమానం - మహబూబ్నగర్ జిల్లా తాజా వార్తలు
మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
బురదగుంటలో నగ్నంగా మృత దేహం.. హత్యగా అనుమానం
ఘటనా స్థలానికి చేరుకున్న భూత్పుర్ సీఐ కిషన్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి మృతుని వివరాలు సేకరించే పనిలోపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది ఆత్మహత్య కాదు.. హత్య జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.