సికింద్రాబాద్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని పార్కింగ్ ప్రాంతంలో మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహం - గుర్తుతెలియని మృతదేహం లభ్యం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఎవరికైనా సమాచారం తెలిస్తే గోపాలపురం పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహం
35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్తున్న మృతుడు... కొంతకాలంగా రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏ కారణం చేత చనిపోయాడనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఎవరికైనా సమాచారం తెలిసినా, సంబంధీకులు ఉన్నా... గోపాలపురం పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:జూన్ 30 వరకు లాక్డౌన్.. కొన్నింటికి అనుమతుల్లేవ్