తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మృతదేహం

చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలిస్తే స్టేషన్​లో సమాచారమివ్వాలని పోలీసులు కోరారు.

unknown dead body found in suraram katta maisamma cheruvu
చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

By

Published : Sep 29, 2020, 9:05 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీసు స్టేషన్​ పరిధిలోని సురారం కట్టమైసమ్మ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం నీటిలో తేలడంతో రోడ్డుపై వెళ్తున్నవారు గమనించి దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి వయస్సు 40 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని, రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిస్తే స్టేషన్​లో సంప్రదించాలని ఇన్​స్పెక్టర్​ కోరారు.

చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ఇదీ చూడండి:కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details