మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని జాతీయ రహదారి పక్కన ఉన్న నల్లచెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలింది. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులకు మృతదేహం కనిపించగా... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
నల్లచెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం... - mahaboobnagar news
చెరువు ఒడ్డున బ్యాగుంది... బీరు సీసాలున్నాయి. కొంచెం తీక్షణంగా చూస్తే... ఓ మృతదేహం నీటిలో తేలియాడుతోంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నల్లచెరువు వద్ద చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు జరిగిందా... ఎవరైన పథకం ప్రకారం చేశారా...? అసలు ఆ మృతుని వివరాలేంటి...?
unknown dead body found in lake in jadcharla
చెరువు ఒడ్డున ఒక బ్యాగు... బీరు సీసాలు ఉన్నాయి. మృతుడు స్నానం కోసం నీటిలో దిగాడా...? మద్యం మత్తులో చెరువులో మునిగి పోయాడా..? అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా...? లేదంటే ఎవరైనా కావాలని చేశారా...? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.